బ్యాంకుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఉద్యోగులు నగరంలోని ఎస్బీఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
'ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలి' - తెలంగాణ వార్తలు
బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ, రేపు బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఆ సమ్మెకు మద్దతుగా వరంగల్ నగరంలో బ్యాంకు ఎంప్లాయిస్ ఆందోళన చేపట్టారు.
బ్యాంకులు ప్రైవేటీకరణ చేయడంతో ఉద్యోగులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రం ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బ్యాంకులు లాభాల బాటలో ఉన్నాయని వివరించిన ఉద్యోగులు.. పలువురు వ్యక్తులకు బ్యాంకులను అప్పగించుటకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ బ్యాంకుల నిర్వీర్యంతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే ప్రమాదముందని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలని.. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి :ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 14 మందికి కరోనా