ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటు పరం చేస్తే ప్రజలపై పెను భారం పడుతుందని... ఏపీజీవీబీ బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య తెలిపారు. కేంద్రం తక్షణమే బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ... దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె వరంగల్ అర్బన్ జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది.
'తక్షణమే బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలి' - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు
కేంద్రం తక్షణమే ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని... ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె వరంగల్ అర్బన్ జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది.
'తక్షణమే బ్యాంకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలి'
హన్మకొండలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఎదుట ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అన్ని బ్యాంకుల్లో సరైన వసతులు కల్పించి... ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. 11వ వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరారు. తక్షణమే కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: శునకాల అందమే.. వారికి ఆదాయం..!