దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ హన్మకొండలోని ఆంధ్రాబాంక్ ఎదుట విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. అన్ని బ్యాంకుల్లో వెంటనే ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులను దెబ్బతీసేందుకు విలీనం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని.. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
హన్మకొండలో ఆందోళనకు దిగిన బ్యాంకు ఉద్యోగులు - బ్యాంకులను విలీనం చేయొద్దంటూ హన్మకొండలో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రాబ్యాంక్ ఎదుట బ్యాంకు ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
![హన్మకొండలో ఆందోళనకు దిగిన బ్యాంకు ఉద్యోగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4831582-thumbnail-3x2-vysh.jpg)
హన్మకొండలో ఆందోళనకు దిగిన బ్యాంకు ఉద్యోగులు