బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వరంగల్ నగరంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ పరిపాలన కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
'న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలి' - BANK_EMPLOYES_ANDOLANA
వరంగల్ నగరంలో బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు.
'న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలి'
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రెండు రోజులపాటు బ్యాంకులను మూసివేసి నిరసన వ్యక్తం చేస్తామని ఉద్యోగుల సంఘం కార్యదర్శి శంకర్ తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఏప్రిల్లో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కేంద్రం కార్పొరేట్ శక్తులకు అండగా ఉండడం వల్లనే మొండి బకాయిలు పెరుగుతున్నాయని ఆరోపించారు.
ఇవీ చూడండి: 'చదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యం'