'వేతన సవరణ, శాశ్వత నియమకాలు చేపట్టాలి' - వరంగల్ అర్బన్ జిల్లా తాజా సమాచారం
హన్మకొండలోని ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. వేతన సవరణ, శాశ్వత నియమకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
'వేతన సవరణ, శాశ్వత నియమకాలు చేపట్టాలి'
By
Published : Jan 8, 2020, 3:41 PM IST
'వేతన సవరణ, శాశ్వత నియమకాలు చేపట్టాలి'
సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. హన్మకొండలోని ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు విధులు బహిష్కరించి తమ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. బ్యాంక్ ఉద్యోగుల వేతన సవరణ.. ఇతర సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. బ్యాంక్లో సరిపడా ఉద్యోగులు లేక ఇబ్బందులు పడుతున్నామని.. శాశ్వత నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.