తెలంగాణ

telangana

ETV Bharat / state

'బ్యాంకుల ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం '

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

By

Published : Mar 15, 2021, 12:45 PM IST

bank-employees-protest-against-privatization-at-hanamkonda-in-warangal-urban-district
బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి: ఉద్యోగులు

బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని యూనియన్ బ్యాంక్ ఎదుట ఉద్యోగులు ధర్నాకి దిగారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు మద్దతు తెలిపారు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. బ్యాంకులో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు.

ఖాళీగా ఉన్న అన్ని విభాగాల పోస్టులను భర్తీ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. పదోన్నతుల పాలసీని వెంటనే సవరించాలని కోరారు. 11వ వేతన ఒప్పందాన్ని గ్రామీణ బ్యాంకుల్లో యథావిధిగా అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:చైనా గబ్బిలాల్లో 24 కొత్త రకం కరోనా వైరస్​లు

ABOUT THE AUTHOR

...view details