పటిష్ఠ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సుల తరలింపు - mptc
వరంగల్ అర్బన్ జిల్లాలోని నిన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు తరలించారు.
వరంగల్ అర్బన్ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాల్లో 3 జెడ్పీటీసీ... 31 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన అనంతరం పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను కాజీపేట్ మండలం మడికొండలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు తరలించారు. నిన్న రాత్రి 11 గంటల సమయానికి బ్యాలెట్ బాక్సులు ఉన్న వాహనాలు పాఠశాలకు చేరుకున్నాయి. ధర్మసాగర్, ఐనవోలు మండలాల ఎంపీడీవోలు బ్యాలెట్ బాక్స్‌ల వెంట వచ్చారు. కాజీపేట ఏసీపీ నరసింహారావు స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు.