పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తైనందున వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో భజరంగ్‌దళ్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. దేశంకోసం 40 మంది జవాన్లు అమరులైన నేడు ప్రేమికుల దినోత్సవం ఎవరూ జరపకూడదని పిలుపునిచ్చారు. దేశ సేవలో అమరులైన సైనికులకు నివాళులు అర్పించాలని కోరారు.
'నేడు ప్రేమికుల దినోత్సవం జరపకూడదు' - పుల్వామా అమరవీరులకు భజరంగ్‌దళ్ నివాళి
పుల్వామా అమరవీరులకు నివాళి అర్పిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో భజరంగ్ దళ్ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.
!['నేడు ప్రేమికుల దినోత్సవం జరపకూడదు' bajrang dal activists pays tribute to Pulwama Martyrs in warangal urban](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6069478-thumbnail-3x2-a.jpg)
'నేడు ప్రేమికుల దినోత్సవం జరపకూడదు'
'నేడు ప్రేమికుల దినోత్సవం జరపకూడదు'
హన్మకొండలోని ఏకశిలా పార్క్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పుల్వామా అమరవీరులకు నివాళి అర్పించారు.
TAGGED:
bhajarang dal ryali