తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల సేవలు మరువలేనివి: బాబు మోహన్​ - పోలీసుల సేవలు మరువలేవన్న మోహన్​ బాబు

కరోనా కలవరపెడుతున్నా పోలీసులు మాత్రం ప్రాణాలు లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, హాస్య నటుడు బాబు మోహన్​ ప్రశంసించారు. హైదరాబాద్​ వెళ్లే మార్గ మధ్యలో చెక్​పోస్టుల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి మాస్క్​లు అందజేశారు.

పోలీసుల సేవలు మరువలేనివి: బాబు మోహన్​
పోలీసుల సేవలు మరువలేనివి: బాబు మోహన్​

By

Published : Apr 20, 2020, 11:20 AM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ పోలీసులు తమ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, హాస్యనటుడు బాబు మోహన్ కొనియాడారు. లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు నిరంతరంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పోలీసులు చేస్తున్న సేవలు మరువలేనివని అభిప్రాయపడ్డారు. విధులు నిర్వహిస్తున్న పోలీసులకు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే మార్గ మధ్యలో చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్క్​లను బాబు మోహన్​ అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details