అయ్యప్ప శరణు ఘోషతో ఓరుగల్లు నగరం మారుమోగింది. ఉర్సు నాగేంద్ర స్వామి ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహా పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, ప్రజలు హాజరయ్యారు.
ఓరుగల్లులో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం - ఓరుగల్లులో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఉర్సు నాగేంద్ర స్వామి ఆలయంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మహా పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
![ఓరుగల్లులో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం ayyappa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5380387-725-5380387-1576408843795.jpg)
ఓరుగల్లులో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం
పంచామృతాలతో పండల రాజ కుమారునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి రంగురంగుల పుష్పాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వాముల భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
ఓరుగల్లులో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం
ఇవీ చూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా?