తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయ్యప్ప పడిపూజ - వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్.. అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు.

vip
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయ్యప్ప పడిపూజ

By

Published : Dec 14, 2019, 8:01 PM IST

వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్ విప్‌, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. స్వామి వారికి వినయ్​ భాస్కర్​ దంపతులు పంచామృతలతో అభిషేకాలు నిర్వహించారు.

ఈ పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప గీతాలు ఆలపిస్తూ భజనలు చేశారు. ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమోగింది. అనంతరం స్వాములకు ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ భోజనాలు వడ్డించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అయ్యప్ప పడిపూజ

ఇవీ చూడండి: 'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details