తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగు దండగ కాదు.. పండుగ: వినయ్ భాస్కర్ - హన్మకొండలోని కృషి భవన్ లో నియత్రింత పంట సాగు పై అవగాహన కార్యక్రమం

గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం దండగలా ఉండేదని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయం పండుగలా మారిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ పట్టణ జిల్లా రైతులు కూరగాయలు, పండ్లు, పూల సాగుకు మొగ్గు చూపాలని సూచించారు. హన్మకొండలోని కృషి భవన్ లో నియంత్రిత పంట సాగు పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Awareness Program for Farmers on Cultivation of Farming in Krishi Bhavan, Hanmakonda
సాగు దండగ కాదు.. పండుగ: వినయ్ భాస్కర్

By

Published : May 30, 2020, 6:19 PM IST

వరంగల్ పట్టణ జిల్లా రైతులు కూరగాయలు, పండ్లు, పూల సాగుకు మొగ్గు చూపాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని కృషి భవన్ లో నియంత్రిత పంట సాగుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. నగరంలో కూరగాయల కొరత ఉందని.. దానికి అనుగుణంగా పట్టణ ప్రాంతలో ఉన్న రైతులు కూరగాయలు పండించి లాభాలు పొందాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వ్యవసాయం లాభసాటిగా మారాలి

కూరగాయలతో పాటు, పండ్లు, పూల సాగు చేయాలని ఎమ్మెల్యే కర్షకులకు సూచించారు. రైతులు పండించిన కూరగాయలను.. నగరంలో ఉన్న మాల్స్, దుకాణాలలో విక్రయాలు జరిగే విధంగా చొరవ తీసుకుంటామని తెలిపారు. గతంలో వ్యవసాయం దండగలా ఉండేదని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయం పండుగలా మారిందని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:ఒకే ఇంట్లో నలుగురికి కరోనా

ABOUT THE AUTHOR

...view details