కరోనా వైరస్ రోజురోజుకు విస్తృతం అవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను చైతన్యమంతం చేయడానికి వరంగల్ నగరానికి చెందిన ఉపేందర్ రెడ్డి తయారు చేయించిన చిత్రాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆవిష్కరించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో వైరస్‌పై అవగాహన కల్పించడానికి దోహదపడతాయని, ఇలాంటి వినూత్న ప్రక్రియలు ప్రజల్లో ఆలోచన ధోరణిని పెంపొందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కరోనాపై అవగాహనకు చిత్రాల ఆవిష్కణ - awareness drawings on corona inaugirated by collector rajiv ghandhi hanumanthu
కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వరంగల్‌లోని ఓ వ్యక్తి చిత్రాలు గీసి తన వంతుగా చైతన్యం చేస్తున్నాడు. అహర్నిశలు ప్రజల రక్షణకై పాటుపడుతున్న డాక్టర్లు, పోలీసుల సేవలను స్పురించేలా గీసిన ఈ చిత్రాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆవిష్కరించారు.
కరోనాపై అవగాహన.. చిత్రాలను ఆవిష్కరించిన వరంగల్ కలెక్టర్
కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధినిర్వహణలో ఉన్న సిబ్బందిని ప్రశంసించే విధంగా ఉన్న పోస్టర్ల ద్వారా పోలీసు సిబ్బందికి మనో నిబ్బరాన్ని కల్గిస్తాయని, వీటిని నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.