వరంగల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి - అక్రమ నిర్మాణాలపై అధికారుల దృష్టి
వరంగల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలతో పాటు రహదారులకు అడ్డంగా ఉన్న దుకాణాలను కూడా తొలగించారు.
![వరంగల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి Authorities pay special attention to illegal structures in Warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8527229-328-8527229-1598180275867.jpg)
వరంగల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి
వరంగల్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారు. నాలాలపై అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు తొలగింపులను ముమ్మరం చేయగా.. రహదారులకు అడ్డంగా ఉన్న దుకాణాలను కూడా తొలగిస్తున్నారు. వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు విస్తరణలో భాగంగా రహదారికి అడ్డంగా ఉన్న నిర్మాణాలను... ఎనుమాముల క్రాస్ రోడ్డులోని జంక్షన్ విస్తరణకు అడ్డంగా ఉన్న దుకాణాలను అధికారులు తొలగించారు
ఇవీ చూడండి: ఎలాంటి సమస్య ఉన్న తమను సంప్రదించండి: మంత్రి ఎర్రబెల్లి