కరోనా వైరస్ వ్యాప్తికి ప్రారంభ దశలోనే పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు వరంగల్ జిల్లా అధికారులు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎవరిని రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వచ్చిన 290 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 21,190 మందిని ఆరోగ్య బృందాలు కలిసి సర్వే నిర్వహించాయి.
వైరస్ నియంత్రణకై వరంగల్లో పటిష్ట చర్యలు - కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు వరంగల్లో అధికారులు ముమ్మర ఏర్పాట్లు
వరంగల్ జిల్లాలో...కరోనా వైరస్ నియంత్రణకు అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్య బృందాలు విస్తృతంగా పర్యటిస్తూ...సర్వేలు నిర్వహిస్తున్నాయి. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉన్న వారిని థర్మల్ స్కానర్ల ద్వారా పరీక్షిస్తున్నారు.

వైరస్ నియంత్రణకై వరంగల్లో పటిష్ట చర్యలు
ఇక మర్కజ్ వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన 62 మంది నమూనాలను తీసి పంపించగా ఫలితాలు మాత్రం రావాల్సి ఉంది. నగరంలోని ఎంజీఎం ఐసొలేషన్ వార్డులో ప్రస్తుతం 07 చికిత్స పొందుతున్నారు. అనుమతులు లేకుండాజిల్లాలోకి ఎవరిని ప్రవేశించకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:-'లాక్డౌన్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'