వరంగల్ అర్బన్ జిల్లాలో పాఠశాలలకు వచ్చే 9, 10 తరగతి విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొదటి రోజు కేవలం 47 శాతం మాత్రమే హాజరు నమోదైతే.. తరువాత రెండు రోజుల్లో 54 శాతానికి పెరగగా నేడు 64 శాతానికి పెరిగింది. వచ్చే నాలుగైదు రోజుల్లో 70-80 శాతానికి విద్యార్ధులు హాజరు శాతానికి చేరుకుంటుందని విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు.
సర్కారీ బడుల్లో హాజరుశాతం పెరుగుతోంది!
వరంగల్ అర్బన్ జిల్లాలో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. నాలుగైదు రోజుల్లో 70-80 శాతానికి చేరుకుంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
హాజరు శాతం పెరుగుతోంది : విద్యాశాఖ అధికారులు
సీఐఐ సహకారంతో 2వేల ఫేస్ షీల్డులను నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో.. పదవ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. దీనివల్ల కరోనా వ్యాప్తి చాలావరకూ తగ్గుముఖం పడుతుందని అధ్యాపకులు చెపుతున్నారు.
ఇదీ చదవండి:తెలంగాణలో ఊపందుకున్న పెట్రో అమ్మకాలు