తెలంగాణ

telangana

స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'ఆత్మనిర్భర్‌ భారత్‌' సదస్సు

By

Published : Mar 8, 2021, 6:50 AM IST

లోకహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'ఆత్మనిర్భర్‌ భారత్‌' సదస్సుని హన్మకొండలో నిర్వహించారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో సరిగా అమలు కావడం లేదని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్ అన్నారు. ప్రధాని మోదీ నిరంతరం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు.

'Atmanirbhar‌ Bharat' Conference under the auspices of a charity
స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'ఆత్మనిర్భర్‌ భారత్‌' సదస్సు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను తెలంగాణలో సరిగా అమలు చేయడం లేదని కేంద్ర జలశక్తిశాఖ నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్ విమర్శించారు. హన్మకొండలోని హరిత హోటల్‌లో లోకహిత స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 'ఆత్మనిర్భర్ భారత్‌' ఆంశంపై జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ప్రధాని మోదీ నిరంతరం పేదల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారని తెలిపారు. వరంగల్‌ స్మార్ట్‌ సిటీ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదని ఆక్షేపించారు.

ఇదీ చూడండి :రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details