వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో నేటి నుంచి జరగనున్న అతి రుద్ర మహాయాగాన్ని పురస్కరించుకుని శనివారం వేదపండితులు శోభాయాత్ర నిర్వహించారు. వెయ్యిస్తంభాల ఆలయంలోని పార్వతీ పరమేశ్వరుని ఉత్సవ విగ్రహాలతో చేసిన ఈ శోభాయాత్ర... డప్పు వాయిద్యాల మధ్య వైభవంగా జరిగింది.
హన్మకొండలో నేటినుంచి అతిరుద్ర మహాయాగం - latest news on athi rudra yagam starts from today in hanmakonda
హన్మకొండలో భవిత చిట్‌ఫండ్స్ ఆధ్వర్యంలో నేటి నుంచి అతిరుద్ర మహాయాగం నిర్వహించారు. దీనిలో భాగంగా శనివారం వేదపండితులు శోభాయాత్రను నిర్వహించారు. నేటి నుంచి ఈనెల 21 వరకు ఈ యాగం కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హన్మకొండలో నేటి నుంచి అతిరుద్ర మహాయాగం
హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో ఏడు రోజుల పాటు జరిగే ఈ మహా యాగ ప్రారంభోత్సవానికి ప్రభుత్వ ఛీప్ విప్ వినయ్ భాస్కర్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యాగానికి ప్రతిరోజు ఒకరి చొప్పున ప్రముఖ ప్రవచకులచే ధార్మిక ప్రసంగాలు ఉంటాయన్నారు.
హన్మకొండలో నేటి నుంచి అతిరుద్ర మహాయాగం
ఇదీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన