మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు : మంత్రి ఎర్రబెల్లి - Medaram jatara news today
ఆసియాలోనే అతిపెద్ద జాతరగా భావించే మేడారంలో శాశ్వత ప్రాతిపదికన విడిది, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈసారి భక్తుల సదుపాయాల కల్పనకు రూ. 75 కోట్లు ప్రత్యేకంగా కేటాయించడమే కాకుండా వివిధ శాఖల ద్వారా ప్రత్యేక నిధులు ఖర్చు చేశామన్నారు. ఎన్ని సదుపాయాలు కల్పించినా జాతరలో ఇబ్బందులు ఉండనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. సమ్మక్కసారలమ్మ దర్శనానికి గవర్నర్‌తో పాటు సీఎం కేసీఆర్ రానున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.
మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు : మంత్రి ఎర్రబెల్లి