ఆరోగ్యశ్రీ సేవలు నాలుగో రోజూ నిలిచిపోయాయి. ఫలితంగా వరంగల్ జిల్లాలోని రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎంజీఎం ఆసుపత్రికి వెళ్తున్నారు. అంతకుముందు ఆరోగ్యశ్రీ కింద నమోదు చేసుకున్న వారికి మాత్రమే సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించేలా చూడాలని రోగులు వేడుకుంటున్నారు. తమ 4 డిమాండ్లను పరిష్కరిస్తే యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తామని నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం చెబుతున్నారు. పెండింగ్ ఉన్న బకాయిలతో పాటు 12 సంవత్సరాల క్రితం నిర్ణయించిన ధరలను కాకుండా పెరిగిన ఖర్చులకు అనుగుణంగా వైద్య ఖర్చులను పెంచాలని యాజమాన్య సంస్థలు డిమాండ్ చేస్తున్నారు.
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు.. రోగులకు తప్పని ఇక్కట్లు - నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలతో రోగులకు తప్పని ఇక్కట్లు
వరంగల్ జిల్లాలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ బకాయిలపై చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరింది. అత్యవసర పరిస్థితిలో వైద్యులు ఎంజీఎం ఆసుపత్రికి వెళ్తున్నారు.

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలతో రోగులకు తప్పని ఇక్కట్లు
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలతో రోగులకు తప్పని ఇక్కట్లు
ఇవీ చూడండి: మద్యం మత్తులో డ్రైవర్- ఫుట్పాత్ పైకి కారు