fight on CMD Prabhakar Rao and KTPP refugees: జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిరసన సెగ తగిలింది. గణపురం మండలం చెల్పూరులో దుబ్బపల్లి నిర్వాసితులు సీఎండీని అడ్డుకున్నారు. గ్రామాన్ని మరోచోటుకు తరలిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటి వరకూ ఎందుకు నెరవేర్చడం లేదని సీఎండీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా బూడిదలో బతుకుతున్నామమని, పంటలు నాశ నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జెన్‌కో సీఎండీకి షాక్.. కేటీపీపీ నిర్వాసితుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి - Concern of the residents of Dubbapally
fight on CMD Prabhakar Rao and KTPP refugees: జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిరసన సెగ తగిలింది. గణపురం మండలం చెల్పూరులో దుబ్బపల్లి నిర్వాసితులు సీఎండీని అడ్డుకున్నారు. గ్రామాన్ని మరోచోటుకు తరలిస్తామని ఇచ్చిన హామీని ఇప్పటి వరకూ ఎందుకు నెరవేర్చడం లేదని సీఎండీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ దశలో గ్రామస్థులు వేసిన ప్రశ్నలకు సీఎండీ ఉక్కిరి బిక్కిరి అయ్యారు. రెండు నెలల్లో గ్రామాన్ని ఖాళీ చేయిస్తానని, ప్రభాకర్ రావు.. గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కేటీపీపీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు. గ్రామం తరలింపులో అలసత్వం వహించడం వల్లే ఇంతవరకూ వచ్చిందని కేటీపీపీ సీఈపై ఆగ్రహ వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా దుబ్బపల్లిని ఖాళీ చేయించి మరోచోటుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
"మేము పదేళ్లుగా బూడిదలో బతుకుతున్నాం.. మా పంటలు నాశనం అవుతున్నాయి. తమ గ్రామాన్ని మరోచోటుకు తరలిస్తామని ఇచ్చిన హామీ ఎందుకు ఇంత వరకు నెరవేర్చడం లేదు." - నిర్వాసితులు