తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రీతిని సైఫ్ మానసికంగా వేధించాడు.. నిర్ధారించిన యాంటీ ర్యాగింగ్ కమిటీ - ప్రీతి ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం

Anti Ragging Committee Meeting on Preethi Incident : మెడికో విద్యార్థిని ప్రీతి వ్యవహారంలో నిందితుడు సైఫ్... మానసిక వేధింపులు నిజమేనని ర్యాంగింగ్ నిరోధక కమిటీ నిర్ధారించింది. యూజీసీ ఆదేశాల మేరకు వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ... ప్రీతి మృతికి ముందు కాలేజీలో జరిగిన ఘటనలపై చర్చించింది. కమిటీలో చర్చల నివేదికను యూజీసీకి పంపిస్తామని కేెఎంసీ ప్రిన్సిపల్ తెలిపారు.

Anti Ragging Committee Meeting
Anti Ragging Committee Meeting

By

Published : Mar 1, 2023, 9:21 PM IST

Updated : Mar 1, 2023, 10:11 PM IST

Anti Ragging Committee Meeting on Preethi Incident : వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య అనంతరం యూజీసీ ఆదేశానుసారం... వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. దాదాపు 4 గంటలకుపైగా కమిటీ సభ్యులు ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. మెడికో ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ మానసికంగా వేధించాడని బుధవారం సమావేశమైన యాంటీ ర్యాగింగ్ కమిటీ నిర్ధారించింది. కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్​దాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 13 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగిన మీటింగ్​లో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానకి ముందు జరిగిన పరిణామాలపై చర్చించారు.

ప్రీతి, సైఫ్​కు మధ్య విభేదాలకు కారణాలేంటి :ఈ సమావేశంలో ప్రీతికి కౌన్సిలింగ్ ఇచ్చిన వైద్యులెవరు? సీనియర్ సైఫ్​తో కలిసి ప్రీతి ఎన్నిసార్లు రాత్రి విధులు నిర్వహించింది ? సీనియర్​ సైఫ్​, ప్రీతికి మధ్య విభేదాలు తలెత్తడానికి గల కారణాలపై చర్చ జరిగింది. గత సంవత్సరం నవంబర్ 18న అడ్మిషన్ పొందిన వైద్య విద్యార్థిని ప్రీతికి, సైఫ్​కు భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయన్న అంశాలపై ప్రధానంగా ఈ కమిటీ చర్చించింది. ప్రీతిపై సైఫ్.. పీజీ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో హేళన చేస్తూ ప్రీతిని కించపర్చేవిధంగా పోస్టులు పెట్టినట్లు కమిటీ నిర్ధారించింది.

ప్రీతి హెచ్​వోడీకి ఏమని ఫిర్యాదు చేసింది : జీఎంహెచ్ ఆస్పత్రిలో ప్రీవెంట్ అనస్థీషియా నివేదిక విషయంలో జరిగిన వాగ్వాదమొక్కటే వీరి మధ్య గొడవకు కారణం కాదని కమిటీ తేల్చింది. అదేవిధంగా వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన అనస్థీషియా వైద్య విభాగం హెచ్​వోడీ నాగార్జునరెడ్డిని కమిటీ పిలిపించి విచారించింది. ఈ సందర్బంగా మాట్లాడిన హెచ్​వోడీ... సైఫ్ తనను టార్గెట్ చేస్తూ వేధించాడని వైద్య విద్యార్థిని ప్రీతి ఆయన దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో ఆమె రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. అప్పుడు ప్రీతి, సైఫ్​కు కౌన్సిలింగ్ ఇచ్చి.. జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు హెచ్​వోడీ నాగార్జున్​రెడ్డి యాంటీ ర్యాగింగ్ కమిటీకి తెలిపారు.

కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా ప్రీతిని సైఫ్ వేధించినట్లు కమిటీ పేర్కొంది. మానసికంగా వేధించినా.. అది ర్యాగింగ్ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. కానీ ఎలాంటి లైంగిక వేధింపులు లేవని సమావేశం అనంతరం ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. ఈ నివేదికను దిల్లీలోని యూజీసీతో పాటు ఎన్​ఎంసీకి కూడా పంపిస్తామని పేర్కొన్నారు.అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు.

ఈ సమావేశంలో ప్రిన్సిపల్, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ఆర్డీవో వాసుచంద్ర, అసోసియేట్ ప్రొఫెసర్ దామోదరి బాయ్, కేఎంసీ వైస్ ప్రిన్సిపల్ డేవిడ్, ఫోరెన్సిక్ అసోసియేట్ ప్రొఫెసర్ రజా మాలిఖాన్ పాల్గొన్నారు. హెచ్​వోడీ నాగార్జునరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రీతి విధుల్లో ఉన్న సమయంలో... పని చేసిన తోటి విద్యార్ధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 1, 2023, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details