తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతికి వ్యతిరేకంగా వరంగల్​లో వినూత్న కార్యక్రమం

అవినీతిని నిరోధించాలని జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ వరంగల్​లో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దేశంలో అవినీతి పెరిగిపోయిందని ఆ సంస్థ వ్యవస్థాపకులు అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

By

Published : Dec 9, 2020, 5:33 PM IST

anti corruption special program in warangal urban district
అవినీతికి వ్యతిరేకంగా వరంగల్​లో వినూత్న కార్యక్రమం

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలో జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హన్మకొండ చౌరస్తా నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు అవినీతిని రూపుమాపాలని కోరుతూ శవ యాత్ర చేపట్టారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని... నిర్మూలించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని జ్వాలా అవినీతి వ్యతిరేక వ్యవస్థాపకుడు ప్రశాంత్ ఆరోపించారు.

అవినీతికి వ్యతిరేకంగా వరంగల్​లో వినూత్న కార్యక్రమం

ప్రశ్నించేతత్వాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. అవినీతి ఉద్యోగులు, ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

ఇదీ చదవండి:దమ్ముంటే రాజీనామా చెయ్.. ఎవరేంటో తెలుస్తది: బాబుమోహన్

ABOUT THE AUTHOR

...view details