తెలంగాణ

telangana

ETV Bharat / state

anchor suma in temple: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న యాంకర్ సుమ - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు

anchor suma in temple:శ్రీభద్రకాళి అమ్మవారిని వ్యాఖ్యాత సుమ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

anchor  Suma visiting Sri Bhadrakali Temple
శ్రీభద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్న వ్యాఖ్యాత సుమ

By

Published : Apr 26, 2022, 6:14 PM IST

anchor suma in temple: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన సుమకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జయమ్మ పంచాయతీ సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. దర్శనానంతరం అర్చకులు ప్రసాదాలతో పాటు వస్త్రాలను అందజేశారు. ఆలయానికి వచ్చిన సుమతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.

బుల్లితెర వ్యాఖ్యాతగా ఎన్నో లక్షల మంది హృదయాలను గెలుచుకున్న సుమ.. మరోసారి వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. మే 6న చిత్రం రిలీజ్ కానుంది. సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె వెండితెరపై సందడి చేయనుంది.

శ్రీభద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్న వ్యాఖ్యాత సుమ

ABOUT THE AUTHOR

...view details