తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంజీఎం ఆస్పత్రిలో అదనంగా మరో వంద పడకలు - ఎంజీఎం ఆస్పత్రి తాజా వార్తలు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అదనంగా మరో వంద పడకలు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆస్పత్రి కార్యనిర్వహణ అధికారి నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కరోనా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించనున్నట్లు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు.

ఎంజీఎం ఆస్పత్రిలో అదనంగా మరో వంద పడకలు
ఎంజీఎం ఆస్పత్రిలో అదనంగా మరో వంద పడకలు

By

Published : Sep 16, 2020, 6:41 PM IST

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు అదనంగా మరో వంద పడకలు అందుబాటులోకి తీసుకువచ్చామని ఆస్పత్రి కార్యనిర్వహణ అధికారి నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు. గతంలో 340 పడకలు ఉండేవని కొత్తగా వచ్చిన వంద పడకలతో ఆ సంఖ్య 440 పెరిగిందన్నారు. ఈ మొత్తం పడకలకు ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నట్లు వివరించారు.

ఎంజీఎం ఆస్పత్రి కార్యనిర్వహణ అధికారి నాగార్జున రెడ్డి

గతంతో పోలిస్తే ఎందుకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరిగిందని నాగార్జున రెడ్డి తెలిపారు. ఆగస్టు నాటికి ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య 70 ఉండగా ప్రస్తుతం రెండు గంటలకు పెరిగిందన్నారు. సిబ్బంది కొరత లేకుండా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నామని పేర్కొన్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆయన వెల్లడించారు. సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పరిష్కరిస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: ఎంజీఎంలో కంప్యూటర్ల మొరాయింపు... రోగులకు తప్పని తిప్పలు

ABOUT THE AUTHOR

...view details