hanumakonda man american women : హనుమకొండ జిల్లాకు చెందిన బస్వంత్ రెడ్డి, అమెరికాకు చెందిన ఆలిషా వివాహం ఘనంగా జరిగింది. ఖండాలు దాటిన వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో వీరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కింది. బస్వంత్ రెడ్డి ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఓ ఐటీ కంపెనీలో పని చేస్తుండగా అతనికి అమెరికాకు చెందిన ఆలిషా అనే అమ్మాయి పరిచయం అయ్యింది. వారి పరిచయం ప్రేమగా మారింది.
వివాహ బంధంతో ఒక్కటైన హనుమకొండ అబ్బాయి... అమెరికా అమ్మాయి - వరంగల్ వార్తలు
hanumakonda man american women : ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు కావని మరోసారి నిరూపించింది ఆ జంట. ఖండాంతరాలు దాటి... ఆ ఇద్దరు తమ ప్రేమను గెలిపించుకున్నారు. హనుమకొండ జిల్లాకు చెందిన బస్వంత్‌రెడ్డి, అమెరికాకు చెందిన ఆలిషా.. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు.
America women married
యువతి ప్రేమను జయించిన ఆ యువకుడు... తన తల్లిదండ్రులను ఒప్పించి... వారి సమక్షంలోనే పెళ్లితో ఒక్కటయ్యారు. హనుమకొండలో జరిగిన వీరి వివాహానికి... పలువురు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. పెళ్లిలో తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులు ధరించిన ఆలిషా... ప్రత్యేకంగా ఆకట్టుకుంది. బస్వంత్ రెడ్డిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలిషా తెలిపింది.
ఇదీ చూడండి:Movie ticket price: సినిమా టికెట్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం