తెలంగాణ

telangana

ETV Bharat / state

"లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు" - వరంగల్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి పీ.ఎన్‌.డీ.టీ.ఈ సమావేశం

అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు, ఆబార్షన్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పీ.ఎన్‌.డీ.టీ.ఈ సమావేశంలో పలు సూచనలు చేశారు.

Although the gender confirmation tests are conducted in the Varagal district
"లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు"

By

Published : May 31, 2020, 9:54 AM IST

వరంగల్ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, రికార్డులు సరిగ్గా లేకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పీ.ఎన్‌.డీ.టీ. ఈ సమావేశంలో పలు సూచనలు చేశారు.

విస్తృతంగా తనిఖీలు

అమ్మాయిల సంఖ్య తగ్గుతున్నందున అనుమతులు లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు, ఆబార్షన్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని, చట్టం ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఉల్లంఘనకు పాల్పడిన వారిపై 104కు సమాచారం అందివ్వాలని రాజీవ్‌గాంధీ హనుమంతు కోరారు.

ఇదీ చూడండి:భాగ్యనగర శివారులో విజృంభిస్తోన్న కరోనా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details