కర్నూల్- కాచిగూడ మధ్య రాళ్ల రాకపోకలు నిలిపోయి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు అధికారులు ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు. మన్యంకొండ స్టేషన్ సమీపంలో పట్టాలపై ఒకవైపు ఒరిగి పడిపోయిన రైల్ ఇంజిన్ భోగిని తొలగించే వరకు రైళ్ల రాకపోకలు జరిగే అవకాశం లేకపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంత మంది దగ్గర్లో ఉన్న బస్టాండ్లకు ప్రయాణమవుతున్నారు.
నిలిచిపోయిన రైళ్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు - RAILWAY UPDATES
కర్నూల్ నుంచి కాచిగూడ మధ్య నడిచే రైళ్ల రాకపోకలు నిలిచిపోవటం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్లలో కిక్కిరిసిపోయిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయం చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు.
Alternatives for passengers of stalled trains
మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ మరమ్మతులు చేసే యంత్రం ఇంజిన్ పట్టా తప్పింది. ఈ ఘటనతో కర్నూల్ నుంచి కాచిగూడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం ఐదు గంటలకు కర్నూల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన తుంగభద్ర ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను దేవరకద్ర రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. అంతకు ముందు వచ్చిన గూడ్స్ రైళ్లను మరో ట్రాక్‌పై నిలిపేశారు.
ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు