వరంగల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. రెండు రోజులే సమయం ఉండటంతో వివిధ పార్టీల అభ్యర్థులు మమ్మురంగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచే ఇంటి ఇంటికి తిరుగుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
వరంగల్‌లో జోరుగా ప్రచారం.. ఓటర్లను ఆకర్షించే పనిలో అభ్యర్థులు - వరంగల్ వార్తలు
గ్రేటర్ వరంగల్ పుర ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు వారికి తోడుగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లడుగుతున్నారు. కాళ్లు మొక్కి మరీ తమ అభ్యర్థులను గెలిపించాలని అన్నీ ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను వేడుకుంటున్నారు..
గ్రేటర్ వరంగల్ పుర ఎన్నికల్లో ప్రచార జోరు
ఒక్క ఛాన్స్ ఇవ్వండి...
తమకు ఒక సారి ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ప్రచారంలో చెబుతున్నారు. గెలుపుపై వివిధ పార్టీల అభ్యర్థులు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో తెరాస పార్టీ ఓట్లు అడుగుతుండగా...భాజపా, కాంగ్రెస్ పరస్పరం విమర్శలు గుప్తిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే వీధులను చుట్టేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో మునిగిపోయారు.