తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్ నగరంలో ముస్లింల భారీ ప్రదర్శన - Telangana Latest News

అజ్మీర్ గరీబ్ నవాజ్ 809 ఉర్సు ఉత్సవాలను వరంగల్ నగరంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. విరాళాన్ని అందించేందుకు పెద్ద సంఖ్యలో ఛాదర్ ప్రదర్శన నిర్వహించారు. యాత్రలో ముస్లింలు, హిందువులు కానుకలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

Ajmer Garib Nawaz 809 Ursu celebrations
వరంగల్ నగరంలో ముస్లింల భారీ ప్రదర్శన

By

Published : Feb 13, 2021, 3:14 AM IST

వరంగల్ నగరంలో అజ్మీర్ గరీబ్ నవాజ్ 809 ఉర్సు ఉత్సవాలు పురస్కరించుకుని ముస్లింలు భారీ ప్రదర్శన చేపట్టారు. అజ్మీర్ దర్గాకు తమ వంతు విరాళాన్ని అందించేందుకు పెద్ద సంఖ్యలో ఛాదర్ నిర్వహించారు.

కరీమాబాద్ ఉర్సు దర్గా ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఛాదర్ ప్రదర్శన మైనారిటీ కాలనీ మీదుగా రంగ సాయిపేట వరకు సాగింది. భక్తిశ్రద్ధలతో యాత్రను కొనసాగించారు. దారిపొడవునా ముస్లింలు, హిందువులు కానుకలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చూడండి:యాదాద్రి ఆలయంలో ఘనంగా ఊంజల్​ సేవా ఉత్సవం

ABOUT THE AUTHOR

...view details