తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇవి చట్టాలు కావు.. కార్పొరేట్ సంస్థల చుట్టాలు' - నూతన వ్యవసాయ చట్టాల రద్దు

కేంద్రం సంక్షోభంలో ఉన్న రైతులకు మేలు చేయాల్సింది పోయి.. వారిని మరిన్ని నష్టాల్లోకి నెట్టే చట్టాలను తీసుకొచ్చిందని అఖిలభారత రైతు పోరాట సమన్వయ కమిటీ మండిపడింది. తక్షణమే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

protest in warangal demands new agri laws abolishment
'ఇవి చట్టాలు కావు.. కార్పొరేట్ సంస్థల చుట్టాలు'

By

Published : Dec 23, 2020, 4:37 PM IST

నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఆందోళన చేపట్టింది. తాజా చట్టాలు.. కార్పొరేట్ సంస్థలకు లాభాలు తెచ్చే చుట్టాలని పేర్కొంది. రైతులు ఇదివరకే సంక్షోభంలో ఉన్నారన్న కమిటీ.. కేంద్రం వారికి మద్దతు ధర లేకుండా చేస్తోందని మండిపడింది.

తాజా చట్టాల వల్ల రైతులకు ప్రమాదం పొంచి ఉందని కమిటీ సభ్యులు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో పోరాడే అన్నదాతలకు కేంద్రం మేలు చేయాల్సింది పోయి.. వారిని మరిన్ని నష్టాల్లోకి నెట్టే చట్టాలను తీసుకొచ్చిందంటూ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:రైతులకు కాంగ్రెస్ అన్నివేళలా అండగా ఉంటుంది: జగ్గారెడ్డి

ABOUT THE AUTHOR

...view details