తెలంగాణ

telangana

ETV Bharat / state

చివరి బస్తా వరకు కొనుగోలు చేయాలి - AIKF VISIT Warangal Enamamula MARKET yard

వరంగల్​ ఎనుమాముల మార్కెట్​ యార్డులో ప్రభుత్వం, సీసీఐ అధికారులు తీసుకునే చర్యల వల్ల చిన్న, సన్నకారు రైతులు తీవ్ర నష్టాల పాలు అవుతున్నారని ఏఐకెఎఫ్ రాష్ట్ర నాయకులు ఆరోపించారు.

aikf-visit-warangal-enamamula-market-yard
చివరి బస్తా వరకు కొనుగోలు చేయాలి

By

Published : Dec 12, 2019, 3:32 PM IST

వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డును అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర బృందం సందర్శించారు. యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు తీరును రైతులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలలో తీసుకొచ్చిన పత్తిని మాత్రమే సీసీఐ అధికారులు కొనుగోలు చేయడం బాధాకరమని వెల్లడించారు.

చిన్న, సన్నకారు రైతులు ఐదారు బస్తాలను వాహనంలో ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం, సీసీఐ అధికారుల తీరు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యానికి, ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేసేలా ఉన్నాయని ఏఐకెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పద్మ ఆరోపించారు. మార్కెట్ యార్డ్​కు వచ్చిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

చివరి బస్తా వరకు కొనుగోలు చేయాలి

ఇవీచూడండి: గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల మృతదేహాలు

ABOUT THE AUTHOR

...view details