ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని ఏఐఎఫ్డీఎస్ డిమాండ్ చేసింది. ప్రభుత్వాలు కార్పొరేట్ విద్యా విధానాన్ని పెంచిపోషించేందుకే ఈ బిల్లును చేసినట్టు ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున ఆరోపించారు. వరంగల్లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలి: ఏఐఎఫ్డీఎస్ - వరంగల్ తాజా వార్త
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రద్దు చేయాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున డిమాండ్ చేశారు. వరంగల్లో నిర్వహించిన ఓ సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కేంద్రం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 800 విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా ముసాయిదాలో 200 గ్లోబల్ యూనివర్సిటీలను దేశానికి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. గ్రామీణ, పట్టణ పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకే కేంద్రం ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
ఇదీ చూడండి:వ్యవసాయ డిప్లొమా కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్