తెలంగాణ

telangana

ETV Bharat / state

లారీ ఢీకొని వ్యక్తి మృతి - లారీ ఢీకొని వ్యక్తి మృతి

ముందు వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో పక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

Accident in warangle distict one person died
లారీ ఢీకొని వ్యక్తి మృతి

By

Published : Feb 26, 2020, 7:47 PM IST

లారీ ఢీకొని వ్యక్తి మృతి

లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతిచెందిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ బాపూజినగర్ ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. ముందు వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో పక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ప్రమాదంలో బైక్​పై ఉన్న మనోహర్ అక్కడికక్కడే మృతి చెందగా... ఆనంద్ అనే మరో యువకుడికి గాయాలయ్యాయి. మృతుడు హన్మకొండలో డిగ్రీ చదువుతుండగా... కళాశాల నుంచి స్వగ్రామం మడికొండకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

ఉదయం కళాశాలకు వెళుతున్నానని చెప్పి వెళ్ళిన మనోహర్ రోడ్డుపై విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి అతని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.... మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించారు.

ఇవీ చూడండి:దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!

ABOUT THE AUTHOR

...view details