వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని దేవునూర్, ముప్పారం గ్రామ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయపడగా.. బుర్ర కుమార్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులని 108లో ఎంజీఎంకు తరలించగా.... చికిత్స పొందుతూ బుర్ర కుమార్ మృతి చెందాడు. రద్దీ తక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - ధర్మసాగర్ మండలంలోని దేవునూర్, ముప్పారం గ్రామ రహదారి
వరంగల్ అర్బన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవానాలు ఢీకొన్నాయి. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.
వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ఇవీ చూడండి: పంజాగుట్టలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం