దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండ రహదారిపై మొక్కలు నాటుతూ, వరి నాట్లు వేస్తూ విద్యార్థులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రహదారులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
స్మార్ట్ సిటీ అంటే ఇదేనా?.. రోడ్డుపై నాటేసి విద్యార్థుల నిరసన - roads damaged in warangal
దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. రహదారులపైనే నాట్లు వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో రహదారిపై నాట్లు వేసి వినూత్న నిరసన
వరంగల్ మహానగర పాలక సంస్థ స్మార్ట్ సిటీలో చోటు దక్కించుకున్నప్పటికీ నగరంలోని రహదారులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయని తెలిపారు. రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తి తలపై రూ.లక్షన్నర అప్పు ఉంది: భట్టి విక్రమార్క