వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటనలో తమ కార్యకర్తలపై పోలీసులు, తెరాస నాయకులు అక్రమంగా దాడి చేశారని ఆరోపిస్తూ కాళోజి కూడలి వద్ద ధర్నాకు దిగారు.
అక్రమంగా దాడి చేశారు : ఏబీవీపీ కార్యకర్తలు - hanamkonda district latest news
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా తమ కార్యకర్తలపై అక్రమంగా దాడి చేశారని పేర్కొన్నారు.
హన్మకొండలో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన
పోలీసులు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ విద్యార్థులపై లాఠీ చార్జీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి:'వలస కూలీల ఖాతాల్లో నగదు జమ చేయాలి'