దేశ మొదటి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ సేవలు మరువలేనివని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన ఆజాద్ 131 జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పేద, మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 204 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు, విద్యార్థులకు మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు.
కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లో అబుల్ కలాం జయంతి వేడుకలు - Abul Kalam birth anniversary Celebrations at Kadipikkonda Minority Residential School
వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో దేశ మొదటి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హాజరై రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు.
కడిపికొండ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లో అబుల్ కలాం జయంతి వేడుకలు