తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేట్​ యూనివర్సిటీల్లో రిజర్వేషన్​ కల్పించాలని నిరాహార దీక్ష - warangal news

హన్మకొండలో అంబేడ్కర్​ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రైవేట్​ యూనివర్సిటీల్లో రిజర్వేషన్​ కల్పించాలని వారు డిమాండ్​ చేశారు.

absf leaders hunger strike for reservation in private universities
ప్రైవేట్​ యూనివర్సిటీల్లో రిజర్వేషన్​ కల్పించాలని నిరాహార దీక్ష

By

Published : Oct 6, 2020, 5:31 PM IST

ప్రైవేట్​ యూనివర్సిటీల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో విద్యార్థులు ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు. నగరంలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద అంబేడ్కర్​ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిరాహారదీక్షకు దిగారు.

ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రైవేట్​ యూనివర్సిటీలను వెనక్కి తీసుకోవాలని.. లేదా వాటిల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ లేకుండా యూనివర్సిటీలను తీసుకొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చదువును దూరం చేయడమేనని అన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి:ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details