తెలంగాణ

telangana

ETV Bharat / state

Somnath Bharti: 'మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు కేజ్రీవాల్​ను భావిస్తున్నారు' - ts news

Somnath Bharti: మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు కేజ్రీవాల్​ను భావిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంఛార్జ్, మాజీ మంత్రి సోమనాథ్‌ భారతి పేర్కొన్నారు. దిల్లీ, పంజాబ్‌ తరహాలో మిగతా రాష్ట్రాల్లో కూడా పుంజుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆప్​కు ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడానికే ఇక్కడికొచ్చామని ఆయన వెల్లడించారు.

Somnath Bharti: 'మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు కేజ్రీవాల్​ను భావిస్తున్నారు'
Somnath Bharti: 'మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు కేజ్రీవాల్​ను భావిస్తున్నారు'

By

Published : Mar 27, 2022, 4:40 PM IST

Somnath Bharti: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ క్రేజీవాల్‌గా భావిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంఛార్జ్, మాజీ మంత్రి సోమనాథ్‌ భారతి హనుమకొండలో అన్నారు. కాజీపేట నుంచి హనుమకొండ అంబేడ్కర్​ సెంటర్ వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంఛార్జ్ భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సెర్చ్ కమిటీ ఛైర్​పర్సన్ ఇందిరా శోభన్, సభ్యులు ఘన స్వాగతం పలికారు. నగరంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.

దిల్లీలో కూడా తెలంగాణ ప్రజలు ఉన్నారని.. వారంతా ఆమ్ ఆద్మీ పార్టీ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ అంతటా ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడానికే ఇక్కడికొచ్చామని పేర్కొన్నారు. దిల్లీ, పంజాబ్‌ తరహాలో మిగతా రాష్ట్రాల్లో కూడా పుంజుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆప్​కు ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. పార్టీని ఇంటింటికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని తెలిపారు. ఆనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు.

వారంతా ఆమ్ ఆద్మీ పార్టీ వెంటే..

మొదటి సారిగా ఆమ్​ ఆద్మీ పార్టీ అభివృద్ధి కోసం ఇక్కడికి వచ్చాను. తెలంగాణ అంతటా ర్యాలీలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడానికే ఇక్కడికి వచ్చాం. ఈరోజు వరంగల్​లో ర్యాలీ నిర్వహిస్తున్నాం. రేపు హైదరాబాద్​లో ర్యాలీ నిర్వహించనున్నాం. దిల్లీలో కూడా తెలంగాణ ప్రజలు ఉన్నారని.. వారంతా ఆమ్ ఆద్మీ పార్టీ వెంటే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ క్రేజీవాల్‌ను భావిస్తున్నారు. -సోమ్​నాథ్​ భారతి, ఆమ్​ ఆద్మీ పార్టీ సౌత్​ ఇండియా ఇంఛార్జి

'మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు కేజ్రీవాల్​ను భావిస్తున్నారు'

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details