తెలంగాణ

telangana

ETV Bharat / state

'పసికందు కుటుంబీకులకు ఆచారి పరామర్శ' - OBC COMMISION MEMBER ACHARY

తొమ్మిది నెలల చిన్నారి అత్యాచారానికి గురై మరణించిన ఘటనలో బాధిత కుటుంబాన్ని హన్మకొండలో జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యుడు పరామర్శించారు. చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

బాధిత కుటుంబనికి రూ.17 లక్షల ఆర్థిక సహాయం : ఓబీసీ కమిషన్

By

Published : Jun 23, 2019, 11:53 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండలో ఉన్మాది చేతిలో హతమైన తొమ్మిది నెలల పసికందు కుటుంబాన్ని జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యుడు ఆచారి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 11 రోజుల వ్యవధిలో నిందితుడికి ఉరి శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని చిన్నారి తల్లిదండ్రులకు ఆయన హమీ ఇచ్చారు.

ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా కేసులో పురోగతి లేదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నమోదు చేసి త్వరితగతిన శిక్షపడేలా చూడాలని ప్రభుత్వన్ని కోరారు. బాధిత కుటుంబానికి రూ.17 లక్షల ఆర్థిక సహాయం అందించి, ఇంటిని కేంద్ర ప్రభుత్వం ద్వారా అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసును న్యాయస్థానం ప్రత్యేకంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యుడు

ఇవీ చూడండి : చిన్నారి నిండు ప్రాణాన్ని టిప్పర్​ తొక్కేసింది

ABOUT THE AUTHOR

...view details