.
క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు నిర్వాహకురాలు యాకూబీ క్షవరం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులు అందుబాటులో లేక కొన్ని రోజులుగా వృద్ధులకు జుట్టు, గడ్డం పెరిగాయి. ఎండాకాలం కావటం వల్ల చిరాకు పడుతున్నారు. వారి అవస్థ చూసిన యాకూబీ సోమవారం స్వయంగా 20 మందికి క్షవరం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు.
క్షౌరశాలలు లేకుంటేనే..? మీకు నేనున్నా..!
Last Updated : May 5, 2020, 1:34 PM IST