Formation of a team named Nagamma Shakti: మహిళలు, పిల్లల అక్రమ రవాణా (ట్రాఫికింగ్)ను అరికట్టడానికి రైల్వే రక్షక దళం ‘శక్తి’ పేరుతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది. కాజీపేట రైల్వే భద్రత దళం (ఆర్పీఎఫ్) పరిధిలో నాగమ్మ శక్తి పేరుతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా ఎస్సైతో పాటు ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు సేవలందిస్తున్నారు. సికింద్రాబాద్‌లో ఈ బృందానికి రుద్రమ శక్తి, వరంగల్‌లో భద్రకాళి శక్తిగా పేర్లు పెట్టారు.
ఈ బృందాలు రైళ్లలో ప్రయాణికుల్లా వెళుతూ ట్రాఫికింగ్‌ను పసిగడతాయి. ఇటీవల ఒడిశా నుంచి 15 మంది పిల్లలను వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఇటుక బట్టీల్లో పనిచేయించడానికి తీసుకొస్తుండగా, వారికి అవగాహన కల్పించి తిరిగి సొంత ఊళ్లకు పంపించి అక్కడ పాఠశాలల్లో చేరేలా చేశారు. ఆపరేషన్ మహిళా సురక్షలో భాగంగా.. రైళ్లలో రాత్రిపూట ఒంటిరిగా ప్రయాణం చేస్తున్న మహిళల జాబితాను ఆర్పీఎఫ్ అధికారులు ముందస్తుగా తయారు చేసుకుంటారు.