విహారయాత్రకు వెళ్లి.. గల్లంతయ్యాడు - ఏపీలో గోదావరి పడవ ప్రమాదం
స్నేహితులతో సరదాగా పాపికొండల విహార యాత్రకు వెళ్లిన ఓ యువకుడు గోదావరిలో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యాడు. తమ కుమారుడు ఎక్కడున్నాడోనని ఆ తల్లితండ్రులు పడుతున్న వేదన చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని న్యూశాయంపేటకు చెందిన దోమల హేమంత్ నిన్న జరిగిన గోదావరి ప్రమాదంలో గల్లంతయ్యాడు. ఎంటెక్ పూర్తి చేసిన హేమంత్ హైదరాబాద్లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈగా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి సరదాగా పాపికొండల విహారయాత్రకు వెళ్ళిన హేమంత్ అక్కడ జరిగిన బోట్ ప్రమాదంలో గల్లంతయ్యాడు. అతనితో పాటు వెళ్లిన నలుగురు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరు యువకుల ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న హేమంత్ తల్లిదండ్రులు హుటాహుటిన రాజమండ్రికి బయలుదేరారు.
- ఇదీ చూడండి : గల్లంతైన వారి ఆచూకీ కనిపెడుతుంది...!