తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆన్​లైన్ తరగతుల పేరుతో వేధింపులు  సరికాదు: ఏబీవీపీ - వరంగల్​లో ఏబీవీపీ నిరసన

విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలంటూ వరంగల్ నగరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆన్​లైన్ తరగతుల ద్వారా చిన్నారుల కంటి చూపు మందగిస్తుందని... ఈ​ సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

A New Way to Private Educational Institutions Income to Online Classes said by ABVP leaders in Warangal district
ప్రైవేటు విద్యాసంస్థల ఆదాయానికి నూతన మార్గం... ఆన్​లైన్​ తరగతులు : ఏబీవీపీ

By

Published : Jun 27, 2020, 5:15 PM IST

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... వరంగల్ నగరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్... జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు.

లాక్​డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను... విద్యాసంస్థలు ఫోన్ల ద్వారా ఫీజుల పేరిట భయాందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఆన్​లైన్ తరగతుల ద్వారా చిన్నారుల కంటి చూపు మందగిస్తుందని వివరించారు. ఈ ఆన్​లైన్​ తరగతుల సమస్యలను పరిష్కరించని పక్షంలో... రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి :మా ఇంట్లోకి నేను వెళ్లాను..! సమస్యలుంటే న్యాయపరంగా తేల్చుకోవాలి: దాసరి అరుణ్‌

ABOUT THE AUTHOR

...view details