పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో యువత భారీ ర్యాలీ చేపట్టారు. చైతన్య డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో చైనా సైనికుల చేతిలో అమరుడైన.. కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు ఉపేందర్, మంజుల దేవి పాల్గొన్నారు.
ఘనంగా.. పుల్వామా అమరవీరుల దినోత్సవం - massive youth rally was held at the Warangal Urban District
వరంగల్ అర్బన్ జిల్లాలో.. పుల్వామా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు ఘనంగా నివాళులర్పించారు.
హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. అమరవీర సైనికుల ఆశయాలను కొనసాగిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యువత చెడుదారి పట్టకుండా తాము అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు సూచించారు. విద్యార్థులు అమర సైనికులకు నివాళులు అర్పించిన సమయంలో తమ కుమారుడిని తలచుకుని కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి:కశ్మీర్లో భారీ ఉగ్రదాడికి కుట్ర