ప్రియురాలి ఇంట్లో బంగారు ఆభరణాలను చోరీ చేసిన వ్యక్తిని వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 10 లక్షల 25 వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కేశవ్ కుమార్ హన్మకొండలోని కుమారపల్లికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
తాళాలు ఇచ్చి ప్రేమికుడితో చోరీ చేయించిన యువతి - a man theft
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దొంగతనం జరిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలి ఇంట్లో 10 లక్షలకుపైగా విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశాడో ప్రబుద్ధుడు. తీరా చూస్తే ప్రియురాలి హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
కేశవ్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, డబ్బులు ఇస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు ఆర్థికంగా లబ్ధి పొందాడు. అయితే రెండు రోజుల క్రితం ఇంటి తాళాలు ప్రేమికుడికి ఇచ్చి తల్లితో కలిసి కాళేశ్వరం వెళ్లింది. అదే అదనుగా కేశవ్ కుమార్ బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. ఉదయం పాలు పోసే వ్యక్తి గమనించి పక్కింటి వాళ్లకు చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా... యువతిపై అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడింది.
ఇవీ చూడండి: విధుల్లోకి తీసుకుంటారని భావిస్తున్నాం: అశ్వత్థామరెడ్డి