వరంగల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానానికి ఉప రాష్ట్రపతి చేరుకున్నారు.
ఉపరాష్ట్రపతి వరంగల్ పర్యటనకు భారీ బందోబస్తు - వరంగల్ పర్యటనలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
వరంగల్ హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉపరాష్ట్రపతి వరంగల్ పర్యటనకు భారీ బందోబస్తు
అనంతరం అక్కడి నుంచి గట్టి భద్రత నడుమ నగరంలోని ఏవీవీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు. వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఆర్ట్స్ కళాశాల మైదానం హెలిపాడ్ వద్ద పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఉప రాష్ట్రపతి వెళ్లే రోడ్ మార్గంలో ఎక్కడక్కడికడే వాహనాలను అపివేశారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.