తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​లో వ్యభిచార ముఠా గుట్టురట్టు - వరంగల్​లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడులు జరిపారు. ముగ్గురు విటులను, ముగ్గురు మహిళలతో పాటు ముఠా నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు.

police
వరంగల్​లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

By

Published : Dec 3, 2019, 7:23 PM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడులు జరిపారు. హన్మకొండ బస్టాండు సమీపంలోని అన్నపూర్ణ లాడ్జిలో పోలీసులు తనిఖీలు చేయగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సోదాలు జరిపి ముగ్గురు విటులను, ముగ్గురు మహిళలతో పాటు ముఠా నాయకుడిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా నాయకుడు ఒక రాజకీయ నాయకుడు అన్నట్టు సమాచారం. ఈ లాడ్జీతో పాటు బస్టాండు చుట్టు పక్కల ఉన్న లాడ్జీలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంకా వీరి ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

వరంగల్​లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

ABOUT THE AUTHOR

...view details