తెలంగాణ

telangana

ETV Bharat / state

జల్సాలకు అలవాటు పడి చోరీలు.. పోలీసులకు చిక్కి కటకటాల పాలు.. - వరంగల్ తాజా వార్తలు

జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్​ జిల్లా నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

thieves arrest in narsampet
thieves arrest in narsampet

By

Published : Dec 22, 2022, 9:39 PM IST

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నర్సంపేట, గీసుగొండ పోలీస్​స్టేషన్​లలో వేరువేరు దొంగతనాల కేసులో ఐదుగురు నిందితులను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి వివరాలను వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన జింక నాగరాజు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తూ జైలుకి కూడా వెళ్లి వచ్చినట్లు ఆమె తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని కొత్త కొత్త ప్రదేశాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించారు.

బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నాగరాజు పోలీసులకు తారస పడ్డాడని, పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సుమారు 33.7 తులాల బంగారం, 115 గ్రాముల వెండి, ఒక స్కూటీని రికవరీ చేసినట్లు తెలిపారు. దొంగతనం చేసిన బంగారాన్ని మిత్రులైన నాగుల ప్రవీణ్, కట్ట రాజు, ఉల్లందుల ప్రశాంత్, వల్లంపట్ల పరమేశ్​తో కలిసి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. నాగరాజుపై నర్సంపేటలో 7 కేసులు, గీసుకొండ పోలీస్ స్టేషన్​లో ఒక కేసు ఉన్నాయన్నారు.

నాగరాజుతో పాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామని, పట్టుకున్న బంగారం విలువ రూ.17.5 లక్షలు, వెండి రూ.69 వేల వరకు ఉంటుందని డీసీపీ వెంకటలక్ష్మి వివరించారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సీఐ పులి రమేశ్​గౌడ్, ఎస్సైలు బొజ్జ రవీందర్, అంగోత్ సురేశ్​లతో పాటు సిబ్బందిని డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ సంపత్​రావులు అభినందించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details